మంగళవారం రాత్రి సిక్కిం(sikkim)లో భారీ వర్షం కారణంగా లాచెన్ లోయలోని తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. దీంతో ఆ ప్రాంతంలోని అనేక వాహనాలు కొట్టుకుపోగా..వాటిలో ఉన్న 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు.
ఉత్తర సిక్కిం(sikkim)లో మంగళవారం రాత్రి భారీగా కురిసిన వర్షాలకు వరదలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో లొనాక్ సరస్సు ఉప్పొంగి ప్రవాహించడంతో దీని కారణంగా తీస్తా నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఆ క్రమంలో చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని అత్యవసరంగా విడుదల చేశారు. దీంతో లాచెన్ లోయలో పరిధిలో పెద్ద ఎత్తున వరదలు వ్యాపించాయి. ఆ క్రమంలో సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరదలు ఒక్కసారిగా రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 41 వాహనాలు బురదలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
Flash:
Due to sudden cloud burst over Lhonak Lake in North #Sikkim, flash flood occurred in #Teesta River in Lachen Valley. Some army establishments along the valley have been affected and efforts are on to confirm details. 23 personnel have been reported missing and some… pic.twitter.com/x3JidOnuo9
మరోవైపు నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై(Teesta River) ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూడా కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌ను సిక్కింను కలిపే జాతీయ రహదారి 10లోని పలు ప్రాంతాలు కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా చోట్ల రోడ్లు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తీస్తా నది పరివహాక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఇంకోవైపు పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి ప్రాతంలో ముందు జాగ్రత్త చర్యగా నది దిగువ పరివాహక ప్రాంతం నుంచి ప్రజలను తరలించడం ప్రారంభించింది. పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది జూన్‌లో ఉత్తర సిక్కిం జిల్లా భారీ రుతుపవన వర్షాల కారణంగా భారీ వరదల(floods)ను ఎదుర్కొంది. పెగాంగ్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఇది NH10ని పూర్తిగా మూసివేయడానికి దారితీసింది. హైవే వెంబడి ఉన్న మౌలిక సదుపాయాలు గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొన్నాయి. తీవ్ర వర్షపాతం కారణంగా సమీపంలోని నదులు పొంగిపొర్లడం వల్ల లాచెన్, లాచుంగ్ వంటి ప్రాంతాలకు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి రాకపోకలు తెగిపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా దాదాపు 2,400 మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు.