»Eric Garcetti India Plays A Key Role In Shaping The Future Of The World
Eric Garcetti: ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది
ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
Eric Garcetti: ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తును చూసి ఆస్వాదించాలనుకునే వాళ్లు దానికోసం పనిచేయాలనుకుంటే భారత్‌కు రండి. ఈ దేశంలో అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశం దక్కినందుకు గర్వపడుతున్న అని గార్సెట్టి తెలిపారు.
భారత్‌లో భాగస్వామ్య బంధానికి అమెరికా ఎంతో విలువనిస్తుందని తెలిపారు. మేం ఇక్కడికి పాఠాలు బోధించడానికి రాలేదు. నేర్చుకోవడానికి వచ్చామని రెండు దేశాల మధ్య పరస్పర అవగాహనను తెలిపారు. భారత్, అమెరికా మధ్య బంధం కొత్త శిఖరాలకు చేరుకుందని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు. సాంకేతికత, భద్రతతో పాటు ఇతర రంగాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోందని తెలిపారు.