Rahul Dravid: ఓటేసేందుకు లైన్లో నిలబడిన మిస్టర్‌ కూల్‌

రెండో విడత పోలింగ్‌లో భాగంగా క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు నేడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Written By:
  • Updated On - April 26, 2024 / 12:13 PM IST

Rahul Dravid: శుక్రవారం దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడతలో భాగంగా శుక్రవారం కర్ణాటక(karnataka) రాష్ట్రంలోనూ పోలింగ్‌ జరుగుతోంది. ఈ పోలింగ్‌లో మిస్టర్‌ కూల్‌, మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌(Rahul Dravid) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చదవండి :  పెళ్లి వేడుకలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి

ద్రావిడ్‌(Dravid) ఈ ఉదయం బెంగళూరులోని పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. తర్వాత ఆయన అందరిలానే తొలుత లైన్‌లో నిలబడ్డారు. తర్వాత ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత ఆయన అందరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో మనకు దక్కే అవకాశం ఇదేనని తెలిపారు.

చదవండి : చెవుల్లోకి దూరుతున్న వింత పురుగులు.. ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు!

శుక్రవారం జరుగుతున్న లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైసూరు తాలూకాలో ఆయన స్వగ్రామం వరుణ ఉంది. అక్కడే ఆయన ఓటేశారు. ఆయన కొడుకు యతీంద్ర కూడా ఆయనతో పాటు పోలింగ్‌ బూత్‌కి వచ్చి ఓటు వేశారు.

Related News

Devegowda: మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన దేవెగౌడ

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై మొదటిసారి స్పందించారు.