»Arvind Kejriwal Said Soon We Will Rule The India We Are The Biggest Party After Bjp And Congress
Arvind kejriwal: త్వరలో దేశాన్ని పాలిస్తాం..బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మాదే పెద్ద పార్టీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం, మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అరెస్ట్, రాజీనామా గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
arvind kejriwal said Soon we will rule the india we are the biggest party after BJP and Congress
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమ పార్టికి కార్యకర్తలే పెద్ద బలం అని ఆయన అన్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. నన్ను జైలుకు పంపేందుకు ప్లాన్ చేశారన్నారు. ఈరోజు నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభమైందని కేజ్రీవాల్ తన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ఇంటింటికి వెళ్లి బీజేపీని, నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి బట్టబయలు చేయాలన్నారు. నేను జైలులో ఉన్నా.. బయట ఉన్నా.. ఈసారి ఢిల్లీలో బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా రాకూడదని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ తర్వాత దేశంలో తమదే పెద్ద జాతీయ పార్టీ అని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆప్ ఎదుగుతున్న తీరు చూస్తుంటే త్వరలోనే తమ పార్టీ దేశాన్ని పాలీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
हमारा संगठन और कार्यकर्ता आम आदमी पार्टी की सबसे बड़ी ताक़त हैं। सभी AAP कार्यकर्ताओं के साथ संवाद। https://t.co/oSf4SchPb0
ఆప్(aap) నుంచి అధికారాన్ని లాక్కోవాలని కేసులు పెట్టి బడా నేతలను ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భగత్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ జైలుకు వెళ్లే సమస్య వస్తే తగ్గేదే లేదని కేజ్రీవాల్ అన్నారు. తన రాజీనామాపై తొలిసారిగా బహిరంగ వేదికపై మాట్లాడిన ఆయన, దానిని బూటకపు చర్య అని పేర్కొన్నారు. మద్యం కుంభకోణం నకిలీదని, తన ప్రభుత్వాన్ని తొలగించేందుకు అందరినీ అరెస్టు చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. నకిలీ లిక్కర్ స్కాం కేసులో మా సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, విజయ్ నాయర్‌ను అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తనను అరెస్ట్ చేయబోతున్నారని వెల్లడించారు.
ఏ రకంగా చూసినా వారి లక్ష్యం ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకత్వాన్ని అరెస్టు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీలో ప్రభుత్వాన్ని చెదరగొట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఈ విధంగా నరేంద్ర మోడీ జీ ఢిల్లీ(delhi)లో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా తమను ఎన్నికల్లో ఓడించలేరని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టినా, జైలు నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాదు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ల గురించి ప్రస్తావిస్తూ.. వారు భారీ త్యాగాలు చేశారని కేజ్రీవాల్ అన్నారు. ఈ నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. భగత్ సింగ్ బాటలో నడుస్తూ కటకటాల వెనుక కూడా దేశం కోసం పోరాడుతామని తెలిపారు. మేము జైలుకు వెళ్లడానికి కూడా భయపడమని కేజ్రీవాల్ అన్నారు. లోపల సరైన ఏర్పాట్లు ఉన్నాయన్నారు. భగత్ సింగ్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలు జీవితం గడపగా లేనిది..నాకు ఏం సమస్య అని వ్యాఖ్యానించారు.