Crore: రైతే (farmer) రాజు.. అవును, ఆధునిక పద్ధతితో సాగు చేయాలే కానీ.. అన్నదాత నిజంగానే రాజు అవుతారు. మారిన కాలానికి అనుగుణంగా కొందరు పంటలు సాగు చేస్తున్నారు. అలా అధిక ఆదాయం పొందుతున్నారు. తెలంగాణలోనే కాదు.. పొరుగున గల కర్ణాటకలో కూడా ఓ రైతు ఉద్యానపంటల ద్వారా రూ.కోటి సంపాదిస్తున్నారు.
కుందాపుర సమీపంలో గల తెక్కట్టెకు చెందిన రమేశ్ నాయక్‌కు 13 ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో 11 జాతులకు చెందిన 1634 పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇలా ఏడాదికి రూ.కోటి ఆర్జిస్తున్నారు. దీంతోపాటు బియ్యం మిల్లు నడిపిస్తున్నారు. ఇలా తన కాళ్ల మీద తాను నిలబడ్డారు. పలువురుకి ఆదర్శంగా నిలిచాడు.
1968లో రమేశ్ నాయక్ తండ్రి మిల్లు ప్రారంభించాడు. 1979 నుంచి అందులో రమేశ్ పనిచేస్తున్నాడు. తర్వాత క్రమంగా వ్యవసాయం, మిల్లు నడిపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పొలంలో ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేయడం ప్రారంభించారు. పండ్ల పరిశ్రమను ఏర్పాటు చేశారు. వ్యాపారం రూ.10 కోట్లకు (10 crores) పెరిగిందని వివరించారు. సేద్యం ద్వారా రూ.కోటి వస్తోందని చెప్పారు.
బెంగళూరులో గల గాంధీ కృషివిజ్ఞాన కేంద్రం బిలియనీర్ ఫార్మర్ పురస్కారానికి సిఫార్సు చేసిందని తెలిపారు. సేద్యంల నష్టం వస్తోందని అనుకుంటారు. శాస్త్రీయంగా, ఆధునిక విధానంలో సాగుచేస్తే నష్టాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చిని రమేశ్ అంటున్నారు. రేపు (గురువారం) ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రమేశ్ నాయక్ ప్రధాని మోడీ చేతుల మీదుగా బిలియనీర్ ఫార్మర్ అవార్డు స్వీకరిస్తారు.