12 Dead In Violence As Bengal Votes For Panchayat Polls
West Bengal Panchayat Poll: పశ్చిమ బెంగాల్లో (West Bengal) పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. పోలింగ్ సందర్భంగా టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో 12 మంది చనిపోగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఆరుగురు అధికార టీఎంసీ పార్టీకి (tmc) చెందిన వారు ఉన్నారు. బీజేపీ, లెప్ట్, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ ఇతర పార్టీకి చెందిన ఒక్కొక్కరు చనిపోయారు. మరొకరికి రాజకీయ పార్టీకి సంబంధం ఉందా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు.
ఎన్నికలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని బెంగాల్లో అధికార టీఎంసీ (tmc) ఆరోపించింది. ఘర్షణలో చాలా మంది గాయపడ్డారని పేర్కొంది. కొన్ని బ్యాలెట్ బాక్స్‌లు ధ్వంసం చేశారని మండిపడింది. పంచాయతీ ఎన్నికలు కేంద్ర బలగాల భద్రత మధ్య నిర్వహించడంతో.. ఈ మేరకు విరుచుకుపడింది. ఉత్తర 24 పరగణ జిల్లాలో బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పర్యటించారు. ఘర్షణల్లో గాయపడ్డ వారిని కలిశారు. ఓటర్లను కలిసి మాట్లాడారు. జూన్ 8వ తేదీన బెంగాల్ పంచాయతీ ఎన్నికలు ప్రకటించగా.. అప్పటినుంచి ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఓ యువకుడు సహా 15 మంది చనిపోయారని పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
Video of person running with a ballot box during West Bengal Panchayat poll goes viral pic.twitter.com/nrzKKMY9qi
ఓ వ్యక్తి ఎన్నికను ఆపేందుకు బ్యాలెట్ బాక్స్ దొంగిలించి పరుగెత్తాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఎన్నికలు జరుగుతున్న తీరును గవర్నర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇరు వర్గాలతో శాంతి చర్చలు జరుపుతుండటం విశేషం. ఇలా ఓ గవర్నర్ ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ఇదే తొలిసారి.