TG: సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ‘అసత్య కథనాలను రాజకీయ లాభాల కోసం వాడటం నిరాశ కలిగిస్తోంది. మేం నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం. కానీ మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దు. మా సినీ పరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూసినా నేను మౌనంగా ఉండను. మేమంతా ఏకమై నిలబడతాం’ అని అన్నారు. అలాగే రాజకీయాలకు నటులను వాడుకోవడం మానేయాలని మెగా హీరో వరుణ్ తెలిపారు.