బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాపై చీటింగ్ కేసు నమోదైంది. రూ.11.96 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై రెమో, అతని భార్యతోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. 2018-24 మధ్యలో ఒక TV షోలోని డ్యాన్స్ పోటీలో తాము గెలిచిన రూ.11.96 కోట్ల బహుమతిని రెమో వాళ్లు లాక్కున్నారని ఓ డ్యాన్సర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 465, 420 సహా ఇతర సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.