పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-సిరీస్ దీని ఆడియో హక్కులను రూ. 25కోట్లకు కొనుగోలు చేసిందట. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.