తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై కేసు నమోదైంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ను ఉల్లంఘించారంటూ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ జగిత్యాల అటవీ శాఖకు ఫిర్యాదు చేశాడు. ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్లో మే 20, 2022లో అప్లోడ్ చేసిన చిలుక పంచాగం వీడియోలో చిలుకను బంధించారని, ఇది వన్యప్రాణ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు.