AP: తిరుమల శ్రీవారి దర్శనం జనవరి కోటా టికెట్లను TTD ఆన్లైన్లో విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు టికెట్ల విడుదలను వాయిదా వేసినట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆ తేదీలు మినహా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పింది. కాగా.. ఇవాళ ఉదయం వికలాంగులు, వయోవృద్ధుల దర్శన టికెట్లు రిలీజ్ చేయగా.. మధ్యాహ్నం 3 గంటలకు అంగ్రప్రదక్షిణం టోకెన్లు విడుదల కానున్నాయి.