SKLM: వంగర మండలం మరువాడ పంచాయతీలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏవో కన్నబాబు మాట్లాడుతూ.. పంటలను దోమపోటు నివారణ నుండి కాపాడాలని తెలిపారు. ఈ సందర్భంగా దోమపోటు నివారణకు తూటి కాడ కషాయం తయారీ విధానాన్ని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇంఛార్జ్ సింహాద్రి నాయుడు, రైతులు పాల్గొన్నారు.