TG: మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్నది హైకమాండ్ నిర్ణయమని తెలిపారు. పార్టీ నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిష్టకు ఎక్కడా భంగం వాటిల్లలేదని స్పష్టం చేశారు. కాగా.. BRS ఎమ్మెల్యేపై వేటు వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలే పట్టుబడుతున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు.