VZM: సామజిక బాధ్యత క్రింద జొన్న గుడ్డి నగరపాలక ప్రాథమిక పాఠశాలకు ఎస్.బి.ఐ 2.50 లక్షల రూపాయలతో పలు పరికరాలను బుధవారం అందించింది. ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ హాజరయ్యారు. కంప్యూటర్, టేబుల్ బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డు, ఫ్యాన్లు, గ్యాస్ పొయ్యి, వంట పాత్రలు తదితర 43 మౌలిక అవసరాలను కలెక్టర్ చేతుల మీదుగా పాఠశాల యాజమాన్యానికి అందించారు.