ప్రకాశం: గిద్దలూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో అక్టోబర్ 25 ఉదయం 9 నుంచి మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లుగా అర్బన్ సీఐ సురేష్ వెల్లడించారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఉత్సాహవంతమైన యువకులు ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేయాలని సిఐ విజ్ఞప్తి చేశారు.