ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్‌కు టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. ‘సోషల్ మీడియాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీమ్‌ను సెలెక్ట్ చేసేది సోషల్ మీడియా కాదు. టీమ్ మేనేజ్మెంట్, నాయకత్వం ఏం ఆలోచిస్తుందనేది కీలకం. అతని సత్తా ఏంటో మాకు తెలుసు. భారీగా పరుగులు చేస్తాడనే నమ్మకం ఉంది. అందుకే అతడికి మద్దతుగా ఉన్నాం’ అని అన్నాడు.