తన తదుపరి చిత్రం ‘దో పత్తీ’ ప్రమోషన్స్‌లో నటి కృతిసనన్ బిజీగా పాల్గొంటుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సోదరి నుపుర్ సనన్ గురించి మాట్లాడింది. తమ విషయంలో బంధువుల ప్రవర్తన ఎంతో కోపం తెప్పించేదని పేర్కొంది. తమను విభిన్నంగా చూసేవారని.. దాంతో తమకు కోపం వచ్చేదని తెలిపింది.