టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘జాక్’, ‘తెలుసు కదా’ సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటుండగా.. త్వరలోనే ‘టిల్లు క్యూబ్’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో సిద్ధు ‘ఫ్యామిలీ స్టార్’ దర్శకుడు పరశురాంతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్ధు ఒకే చెప్పాడట. స్క్రిప్ట్ వర్క్ కూడా ముగింపు దశకు వచ్చిందట.