సినీ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా ఇవాళ విడుదలై మంచి రెస్సాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాపై నిర్మాత శ్రీనివాస్ నాయుడు ట్వీట్ చేశారు. ‘ఫస్టాఫ్ చాలా డీసెంట్‌గా ఉంది. చివరి 30 ననిమిషాలు మాత్రం అరుపులే. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ థ్రిల్లింగ్. మ్యూజిక్ అదిరిపోయింది. కెమెరామెన్ పనితనం, క్వాలిటీ వేరే లెవల్’ అంటూ రాసుకొచ్చారు. తాజాగా దీనిపై స్పందించిన కిరణ్ అబ్బవరం.. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు.