బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘ధూమ్’ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి 3 భాగాలు రాగా.. త్వరలో ‘ధూమ్-4’ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాపై నయా అప్డేట్ వచ్చింది. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించనుండగా.. కియారా అద్వానీ, శార్వరి వాఘ్నిలు కథానాయికలుగా చేయనున్నారట. వచ్చే ఏడాదిలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.