AP: పోలీస్ శాఖను గత సీఎం జగన్ నాశనం చేశారని హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లకూ రూ.10 కోట్లు కూడా చెల్లించలేకపోయిందన్నారు. ఏఎంసీ చెల్లించకపోవడంతో సీసీటీఎన్ నిర్వీర్యమైందని ఆరోపించారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కోసం డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. అలాగే, సీసీ కెమెరాల నిర్వహణ కోసం డబ్బులు చెల్లించలేదని తెలిపారు.