దేశంలోని వారంలోనే 100కు పైగా విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే తాజాగా మరో 10 ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాధ్ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని క్షుణ్నంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది.