VZM: ఎల్కోట టీడీపీ కార్యాలయం నందు మంగళవారం బూత్, క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా సమావేశంను ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నిర్వహించారు. ఒక రోజు పాటు నిర్వహించిన ఈ సమావేశంలో అక్టోబర్ 26 నుంచి ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదుపై శ్రేణులకు అవగాహన కల్పించారు. నియోజకవర్గంలో 80 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని పార్టీ తమకు లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు.