AP: పేస్బుక్ మాతృ సంస్థ మెటాతో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి ధ్రువపత్రాల జారీ, బిల్లుల చెల్లింపు, ఈ-గవర్నెన్స్ సేవలను మెటా అందించనుంది. ధ్రువపత్రాల కష్టాలు తీరుస్తామని యువగళంలో లోకేశ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, పారదర్శకమైన పౌర సేవలను ప్రభుత్వం మరింత సులభతరం చేయనుంది.