AP: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లే అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా గత టీడీపీ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు.