ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ ముంబై వీధుల్లో నైట్ రైడ్ చేశారు. వారితో పాటు ఆకాష్ భార్య శ్లోకా మెహతా కూడా ఉన్నారు. వారంతా రోల్స్ రాయిస్ కారులో చక్కర్లు కొడుతూ నెటిజెన్ల కెమెరాలకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.