AP: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు నాగార్జునకు చేదు అనుభవం ఎదురైంది. ఓ జ్యూవెలరీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఆయన అనంతపురానికి బయలుదేరారు. అయితే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సమయంలో నాగార్జున వరదలో చిక్కుకున్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను వేరే దారిలో అనంతపురానికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.