సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘జై హనుమాన్’ ఒకటి. దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ మూవీకి కొనసాగింపుగా ఇది రాబోతుంది. తాజాగా ఈ మూవీని ఉద్దేశిస్తూ ప్రశాంత్ వర్మ ట్వీట్ పెట్టాడు. ‘మేము కలిశాం.. ఇదే సంకేతం’ అంటూ.. కోతి తన దగ్గరకి వచ్చిన ఫొటోలను షేర్ చేశాడు. దానికి దివాళి వస్తుందని ట్యాగ్ పెట్టాడు. దీంతో దీపావళికి మూవీపై అప్డేట్ రాబోతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.