TG: ఎన్నో కష్టాలు పడి ఇల్లు కట్టుకున్న వారిని ప్రభుత్వం ఆందోళనకు గురిచేస్తోందని BJP ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ‘పేద, మధ్య తరగతి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. శని, ఆదివారం వస్తే చాలు.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం. బాధితులకు మద్దతుగా ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తాం. పేదల జీవితాలతో ఆటలు వద్దు’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.