AP: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ ఈవీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ వందశాతం జరుగుతుందన్నారు ఎలన్ మస్క్ వంటి టెక్ నిపుణులు సైతం ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు అధికార పార్టీ చేసే ప్రయోగమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం నిలబడాలంటే బ్యాలెట్ పోలింగ్ విధానం కావాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనే బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందని గుర్తు చేశారు.