పొగిడేవారితో జాగ్రత్త ఖాళీ చెంచాతో తినిపిస్తుంటారని పెద్దలు చెబుతుంటారు. మనిషికి పొగడ్తలు లేదా ప్రశంసలు అవసరం, కానీ.. మరీ ఎక్కువ అయితేనే రిస్క్‌లో పడతారని నిపుణులు అంటున్నారు. పొగడ్తలు మానసిక వికాసాన్ని కలిగిస్తాయి. ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. లిమిట్ దాటితేనే వ్యసనంగా మారవచ్చు. ప్రశంసించనిదే ఏ పని చేయలేని నిస్సాహాయులుగా మారుతారని, పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.