జాతీయ అవార్డును గెలుచుకోవడంపై నటి నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవార్డు వస్తుందని ఊహించలేదని తెలిపారు. ‘ఎప్పుడూ ఫేమ్‌ను కోరుకోలేదు. జీవితంలో గుర్తిండిపోయే పాత్రలనే ఎంచుకుంటున్నాను. భారీ బడ్జెట్ మసాలా సినిమాల్లో ఛాన్స్ వచ్చినా నో చెప్పేస్తా. అలాంటి పాత్రలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటున్నా. మంచి పాత్ర అయితే చిన్న సినిమానైనా అంగీకరిస్తాను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.