TG: గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీం జయంతి సందర్భంగా మాజీమంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ఘన నివాళులర్పించారు. ‘అడవి బిడ్డల ఘీంకార స్వరం కొమురం భీం. ఆదివాసుల స్వయం ప్రతిపత్తే ధ్యేయంగా ఎగిసిన ఉద్యమబావుట.. దేశానికి స్వాతంత్రం రాకముందే ‘జల్ జంగల్ జమీన్’ అనే నినాదంతో పోరు తలపెట్టిన పోరాట యోధుడు. ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శం. గోండు వీరుడికి జోహార్లు’ అంటూ ట్వీట్ చేశారు.