TG: మంత్రి కొండా సురేఖపై దావా వేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిరికిపందలా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలేదిలేదన్నారు. ఇకపై ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజా అంశాలకే ప్రాధాన్యత ఇచ్చానని, ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. కొండా సురేఖపై వేసిన దావా ఓ గుణపాఠం కావాలన్నారు.