VZM: మంగళగిరిలోని జరుగుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ప్రసాద్ దంపతులు మంగళవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చేందుకు ఈ సదస్సు తొలి అడుగుగా మారుతుందని ఎమ్మెల్యే తెలిపారు.