మహిళల టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు ప్రైజ్ మనీ రూపంలో ఐసీసీ రూ. 23 లక్షల 40 వేల డాలర్లు అందించింది. ఈ మొత్తాన్ని జట్టులోని 15 మంది ప్లేయర్లకు సమంగా పంచారు. ఫలితంగా ఒక్కొక్కరికి 2 లక్షల 56 వేల డాలర్లు అంటే సుమారు రూ.1 కోటి 30 లక్షలు లభించాయి. జీతాలు తక్కువగా ఉండే వారికి ఆదాయం పరంగా ఇది సానుకూలంశం. కాగా, ఎలాంటి అంచనాలు లేకుండా ఆ జట్టు ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.