మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. ఇక 2:30 గంటల నిడివితో ఈ చిత్రం విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారు.