బాలీవుడ్ నటి కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో ‘టైగర్ ష్రాఫ్ హీరోయిన్’ అని పిలవడంపై స్పందించింది. ఆ పేరును పోగొట్టుకోవడం కోసం రేటింపు కష్టపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సినీ నేపథ్యం లేకపోతే మనం చేసే సినిమాల ఆధారంగా పేర్లు పెట్టేస్తారని, ఆ పేరుతో చాలా మంది పిలిచేవారని పేర్కొంది. కాగా, 2014లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘హీరోపంటీ’ మూవీలో కృతి కథానాయికగా నటించింది.