తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. దేశవ్యాప్తంగా తనపై ఫిర్యాదులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అయితే తాను ఎవరికీ క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి సిద్ధమని వెల్లడించారు.