Young Heroine: రేటు భారీగా పెంచిన యంగ్ హీరోయిన్..!
ఈ మధ్యకాలంలో విడుదలై ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా మారింది. ఆ సినిమా హిట్ అవ్వడానికి సినిమాలోకి కథ ఎంత కీలక పాత్ర పోషించిందో, ఆ అమ్మాయి రోల్ కూడా అంతే పాత్ర పోషించింది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, ఆ మూవీ హిట్ తో ఒక్కసారిగా ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట.
ఆమె గతంలో చిన్న చిన్న రోల్స్ చేసేది. సడెన్ గా హీరోయిన్ అయ్యే అవకాశం దక్కింది. ఆ దక్కిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో, తన కారణంగానే ఈ సినిమా హిట్ అయ్యిందని ఆ బ్యూటీ ఫిక్స్ అయిపోయిందట. ఎవరు హీరోయిన్ రోల్ కోసం ఆమెను సంప్రదించినా, భారీగా డిమాండ్ చేస్తోందట. కనీసం రెమ్యూనరేషన్ కోటికి దగ్గరలో ఉంటే తప్ప తాను ఆ రోల్ చేయడానికి అంగీకరించను అని ఖరాఖండిగా చెప్పేస్తుందట.
ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అయితే, ఆమె అలా అడగడంలో తప్పేమి ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. హీరోలకు కోట్లకు కోట్లు ఇచ్చినప్పుడు, సమానంగా నటించే హీరోయిన్స్ కి మాత్రం ఇస్తే తప్పేంటి అని ప్రశ్సిస్తున్నారు. కొందరేమో, ఒక్క హిట్ కే ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే, మరో రెండు మూడు పడితే తట్టుకోవడం కష్టమే అనే భావనను తెలియజేస్తున్నారు. మరి ఆమె డిమాండ్ చేసినంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారో లేదో చూడాలి.