టాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఏదంటే.. ఆర్ఆర్ఆర్ సినిమానే. కానీ ఇప్పుడు ఇండియా వైడ్‌గా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఏదంటే.. వార్2 అనే చెప్పాలి. అసలు ఎన్టీఆర్, హృతిక్ కాంబో అంటేనే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయింది. అది కూడా ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తున్నాడనే సరికి.. వార్2 పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. అయితే ఎన్టీఆర్‌నే విలన్‌గా ఎందుకు తీసున్నారు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తున్నాడంటే.. మాటలు కాదు. జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ చేసిన నెగెటివ్ రోల్ జస్ట్ శాంపిల్ మాత్రమేనని చెప్పొచ్చు. అది కూడా ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ కాబట్టి.. అసలైన విలన్ పూర్తిగా బయటికి రాలేదనే చెప్పాలి. అయినా కూడా రావణాసురుడిగా నట విశ్వరూపం చూపించాడు యంగ్ టైగర్. కానీ వేరే హీరో సినిమాలో ఎన్టీఆర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో.. చెప్పడానికి బాక్సాఫీస్ లెక్కలు సరిపోవు. నెక్స్ట్ ఇయర్ అదే జరగబోతోంది. 2024లో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా రాబోతోంది ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్2’. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు.
అయితే బాలీవుడ్, టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ యశ్ రాజ్ ఫిలింస్ వారు ఏరికోరి మరీ తారక్‌నే ఎందుకు అప్రోచ్ అయ్యారు? దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసమే ఎందుకు కథ రాశాడు? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే.. ఎన్టీఆర్‌నే ఈ క్యారెక్టర్‌కు ఎందుకు ఎంచుకున్నారనే దానికి.. ఇదే అసలైన రీజన్ అంటున్నారు. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ విలనిజం చూసి ఫిదా అయ్యాడట అయాన్ ముఖర్జీ. అందుకే పట్టుబట్టి మరీ ఎన్టీఆర్‌ను వార్2 కోసం ఒప్పించినట్టు తెలుస్తోంది.
తారక్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు సై అనడంతో.. వార్2 ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రాబోతోంది. అసలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. అలాంటిది.. ఈ ఇద్దరు హీరోలను బిగ్ స్క్రీన్ పై చూస్తే అన్లిమిటెడ్ గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక నవంబర్ వరకు దేవర షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత వార్ 2లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఏదేమైనా.. ఈ సినిమాలతో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం గ్యారెంటీ.