భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నార్త్‌లో మాత్రం భారీగానే వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలంటున్నాయి. దాంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర లైగర్ సత్తా చాటడం పక్కా అంటున్నారు. అందుకే విజయ్ దేవరకొండ హిందీ ప్రమోషన్స్ పై మరింత దృష్టి సారించాడు. ఈ క్రమంలో తన పై మండిపడ్ట ముంబైకి చెందిన థియేటర్ యజమాని, ఎగ్జిబిటర్ అయిన మనోజ్ దేశాయ్‌ని కలిసాడు విజయ్. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గురించి తాను చేసిన కామెంట్స్ తప్పని తెలుసుకున్న మనోజ్ దేశాయ్.. రౌడీకి సారి చెప్పాడు.
ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే విజయ్ దేవరకొండ.. ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్ కు ముందు ఇండియన్ టీమ్ గురించి కూడా మాట్లాడాడు విజయ్. దాంతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగానే.. లైగర్ ఓటిటి డేట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. లైగర్ సినిమా ఓటిటి రైట్స్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించినట్టు టాక్. అయితే లైగర్ మిక్స్డ్ రివ్యూతో కాస్త ముందుగానే ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.
నెలలోపే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న లైగర్ ఓటిటిలోకి స్ట్రీమింగ్ అవనుందని టాక్. అయితే దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి లైగర్ ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.