Vijay Devarakonda : పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' ఫ్లాప్ తర్వాత అర్జెంట్‌గా ఓ హిట్ కొట్టేయాలని భావించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కానీ మనోడి ఆశలను ఆవిరి చేసేసింది సమంత. తప్పని పరిస్థితుల్లో ఖుషి మూవీకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.
పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత అర్జెంట్‌గా ఓ హిట్ కొట్టేయాలని భావించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కానీ మనోడి ఆశలను ఆవిరి చేసేసింది సమంత. తప్పని పరిస్థితుల్లో ఖుషి మూవీకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో కరెక్ట్‌గా వన్ ఇయర్ తర్వాత మళ్లీ థియేటర్లోకి రాబోతున్నాడు రౌడీ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా.. సమంత హెల్ల్ కారణంగా చాలా రోజులుగా వాయిదాపడుతూ వస్తోంది. అయితే ఇటీవలె సామ్ తిరిగి షూటింగ్లో జాయిన్ అయింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ముందుగా సమ్మర్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని వినిపించింది. ఆ తర్వాత జూన్‌లో వచ్చే ఛాన్స్ ఉందన్నారు. కానీ మరింత వెనక్కి వెళ్లింది ఖుషి. ఫైనల్‌గా సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. సమంత, విజయ్‌ది వేర్వేరు ప్రపంచం అన్నట్టుగా ఇందులో చూపించారు. కశ్మీర్ బ్యాక్ డ్రాప్లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. లవ్ స్టోరీస్ సినిమాలు చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ స్టైలే వేరు. అందుకే ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత చేస్తున్న సినిమా ఇదే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరి రౌడీకి ‘ఖుషి’ మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.