‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లిన NTR అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. HYDలోని నోవాటెల్ వద్దకు అంచనాలకు మించి అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. పాస్లు లేకున్నా నోవాటెల్లోకి చొచ్చుకురావడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో భద్రతా కారణాలతో ఈవెంట్ నిర్వహించలేమని నిర్వాహకులు సైతం చేతులెత్తేశారు. లాఠీ ఛార్జ్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.