ఆహాలో పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో పవర్ ఫినాలే ఎపిసోడ్ వన్ తాజాగా విడుదలైంది. పార్ట్ వన్ ఎపిసోడ్ ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు విడుదలైంది. ఈ షోలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇద్దరూ చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఎక్కువగా ఇద్దరూ సినిమాల గురించే మాట్లాడుకున్నారు.
అసలు నువ్వు సినిమాల్లోకి ఎలా వచ్చావు. నీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది అని పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ అడగగా.. అసలు నేను ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. రచయిత కానీ.. డైరెక్టర్ కానీ.. లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ రంగలోకి వెళ్లాలని అనుకున్నా కానీ.. మా వదిన, అత్తయ్య ఇద్దరూ నన్ను ప్రోత్సహించడంతో అలా సినిమాల్లోకి వచ్చాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
అలా సినిమాల్లోకి రావడం జరిగిందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అయితే.. ఖుషీ సినిమా తర్వాత మరో 5 సినిమాలు చేసి ఇక సినిమాలు ఆపేద్దామని అనుకున్నారట పవన్ కళ్యాణ్. ఇలా.. తన సినిమాలకు సంబంధించిన చాలా విషయాలను బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ షేర్ చేసుకున్నారు.