ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు కాస్త బ్రేక్ పడినట్టేనని చెప్పొచ్చు. ఎట్టకేలకు ‘ఆదిపురుష్’ నుంచి ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 2న, అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాస్త ముందుగానే ‘ఆదిపురుష్’ టీజర్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. అయోధ్యలో సరయు నదీ తీరంలో సాయంత్రం 7.11 గంటలకు ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఓం రౌత్ తెలిపారు. అలాగే ఈ జర్నీలో తమతో జాయిన్ కావాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. ఇక ఈ పోస్టర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్‌ని చూసి అదరహో అనేలా ఉందంటున్నారు. అయితే ఈ పోస్టర్ ఊహకందని విధంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాల్లో కనిపించిన రాముని లుక్కు భిన్నంగా.. ఆదిపురుష్‌లో కోర మీసంతో చూపించారు. దాంతో ఆదిపురుష్ టీజర్ పోస్టర్ అంచనాలకు మించి పవర్ ఫుల్‌గా ఉందని అంటున్నారు. ఇక దీని దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ట్విట్టర్లో ఆదిపురుష్, ప్రభాస్ హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు హ్యాష్ ట్యాగ్లు ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఒక్క టీజర్ పోస్టర్‌కే ఇలా ఉంటే.. ఇక టీజర్ రిలీజ్ అయితే ఎంత రచ్చ చేస్తారో ఊహించుకోవచ్చు. మరి జనవరి 12న రానున్న’ఆదిపురుష్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.