డీజే టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ రేంజ్ మారిపోయింది. దీంతో డీజే టిల్లుకి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తీసుకొస్తున్నారు. మాలిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Tillu Square Trailer: డీజే టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ రేంజ్ మారిపోయింది. దీంతో డీజే టిల్లుకి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తీసుకొస్తున్నారు. మాలిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టిల్లు స్క్వేర్ నుంచి వచ్చిన టీజర్ ఈ సినిమాను ఇంకో రేంజ్‌కి తీసుకెళ్లాయి. అయితే ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఈక్రమంలో వాలంటైన్స్ డే సందర్భంగా టిల్లు స్క్వేర్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది. ఇందులో సిద్దు బాడీ లాంగ్వేజ్ సూపర్. అనుపమ పరమేశ్వరన్ ఈసారి గ్లామర్ హద్దులు అన్ని చెరిపేసింది. ఇద్దరి మధ్య చాలా సీన్లు రొమాంటిక్‌గా ఉన్నాయి. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి.