ఒక తన లవర్ చేతిలో చావు దెబ్బలు తిన్నది.. అతడి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఎవరో కాదు.. కోలీవుడ్(Kollywood) హీరోయిన్ అనికా విజయ్ విక్రమన్. (Anika Vijay Vikraman).చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా నటించిన మెప్పించిన అనికా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ (Instagram)లో తన ప్రియుడు చేసిన అఘాయిత్యాన్ని ఏకరువు పెట్టింది.
ఒక తన లవర్ చేతిలో చావు దెబ్బలు తిన్నది.. అతడి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఎవరో కాదు.. కోలీవుడ్(Kollywood) హీరోయిన్ అనికా విజయ్ విక్రమన్. (Anika Vijay Vikraman).చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా నటించిన మెప్పించిన అనికా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ (Instagram)లో తన ప్రియుడు చేసిన అఘాయిత్యాన్ని ఏకరువు పెట్టింది. ప్రేమ.. ఎవరిని ఎప్పుడు ఒకటి చేస్తుందో ఎవరికి తెలియదు. కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తాయి..ఇంకొన్ని ప్రేమలు వివాదాలతో ముగుస్తాయి. కానీ, ఇంకొన్ని ప్రేమలు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా జీవితాంతం హింసిస్తూనే ఉంటాయి. అందుకే ప్రేమను గుడ్డిది అంటారు.
ఈ బాధకు తారలు సైతం అతీతం కాదు. తాజాగా నేను గతంలో అనూప్ (Anup)పిల్లే అనే వ్యక్తితో రిలేషన్ (relation)లో ఉన్నాను. అతడు ముందు బానే ఉన్నాడు. ఉన్నా కొద్దీ అతడిలోని రాక్షసుడును పరిచయం చేశాడు. మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. అతడితో ఉన్న రోజులు అన్నీ నాకు చేదు జ్ఞాపకాలుగా (Bitter memories) మిగిలాయి. అతడు ఇలా మారతాడని నేను కలలో కూడా అనుకోలేదు. అతడి నుంచి నేను ఎంత దూరంగా ఉన్నా కూడా అతడు నన్ను వదలడం లేదు. మొదటిసారి నన్ను అతడు కొట్టినప్పుడు పిక్స్ ఇవి. ముఖం మొత్తం పగులకొట్టాడు. ఆ తరువాత వెంటనే నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాడు. మొదటిసారని వదిలేసా.. కానీ, రెండోసారి కూడా అదే రిపీట్ అయ్యింది. అందుకే అతడి నుంచి దూరమయ్యా.. పోలీసులకు ఫిర్యాదు చేశా..
అయినా అతడి దగ్గర ఉన్న డబ్బుతో పోలీసులను మ్యానేజ్(Manage) చేశాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక మరో వారం రోజులు తాను ఇన్స్టాగ్రామ్ కు రాలేనని.. అని చెప్తూ గాయాలతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సాధారణ అమ్మాయిల నుండి సెలబ్రిటీల(Celebrities )వరకు ప్రేముకుడి వల్ల వేధింపులకు గురైన సంఘటనలు చాలా ఉన్నాయి. నేను దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే డ్రామా బాగా చేస్తున్నావ్ అంటూ హేళన చేస్తు నవ్వేవాడు ‘అంటూ ఆమె మనసులో ఉన్న బాధ బయటపెట్టింది.