»Special Offer Adipurush Movie Tickets 3d For Rs150
Adipurush: రూ.150కే ‘ఆదిపురుష్’ 3D టికెట్.. ఎక్కడో తెలుసా!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, దేవదత్త నాగే హనుమాన్‌గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా.. జూన్ 16 గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. అందుకే థియేటర్స్‌కు ఆడియెన్స్‌ను రప్పించడానికి స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా రూ.240 కోట్ల థియేట్రికల్ బిజెనెస్ జరుపుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఐదు రోజుల్లో రూ.395 కోట్లు రాబట్టింది. దీంతో ఆరు రోజుల్లో రూ.400 కోట్ల మార్క్‌ను టచ్ చేసినట్టే. ఈ వీకెండ్ వరకు రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది. అయితే ఈ కలెక్షన్స్‌ను మరింతగా పెంచేందుకు.. ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి మేకర్స్ బంపరాఫర్ ప్రకటించారు. ఈ నెల 22, 23 తేదీల్లో త్రీడి వెర్షన్ టికెట్ రేటును 150 రూపాయలుగా ఫిక్స్ చేశారు.
కానీ త్రీడి గ్లాసెస్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ సౌత్ స్టేట్స్ వారికి లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలకు వర్తించదు. కేవలం హిందీ వారి కోసం మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించారు. 22, 23 తేదీల తర్వాత వీకెండే కాబట్టి.. ఆదిపురుష్‌కు భారీ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. వీక్ డేస్‌లో నార్త్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసేందుకు ఇదో మంచి స్ట్రాటజీ అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే సౌత్ స్టేట్స్లో ఈ ఆఫర్ ఇవ్వకపోవడానికి కారణం లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. పైగా ఈ సినిమాకు పోటీగా థియేటర్లో మరో సినిమా లేదు.
అందుకే, మేకర్స్ కేవలం 150 రూపాయల త్రీడి ఆఫర్‌ను నార్త్ స్టేట్స్ మాత్రమే పరిమితం చేశారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో చిత్రయూనిట్ ఆ డైలాగ్స్‌ని మార్చారు. కొత్త డైలాగులను సినిమాలో యాడ్ చేశారు. అయినా కూడా ఆదిపురుష్ పై వివాదాలు వస్తునే ఉన్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కొందరు కోర్టులో ఫిర్యాదు కూడా చేశారు. ఏదేమైనా ఆదిపురుష్ మాత్రం డివైడ్ టాక్‌తో భారీ వసూళ్లనే రాబట్టిందని చెప్పాలి.