»Sandeep Reddys New Look In Tirumala Is Viral Spirit Update Once Again
Sandeep Reddy: సందీప్ రెడ్డి నయా లుక్ వైరల్.. మరోసారి స్పిరిట్ అప్డేట్!
ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అనిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. దీంతో తాజాగా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నాడు సందీప్.
Sandeep Reddy's new look in Tirumala is viral.. Spirit update once again!
Sandeep Reddy: అనిమల్ సినిమా ఏకంగా 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ అవేవి లెక్కచేయకుండా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అలాగే.. సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అనిమల్ మూవీకి ముందే స్పిరిట్ అనౌన్స్ చేశారు సందీప్, ప్రభాస్. కానీ ఇతర కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాకే స్పిరిట్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. రాజాసాబ్ షూటింగ్ జరుగుతోంది. దీంతో నెక్స్ట్ స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. అయితే.. సందీప్ రెడ్డి, అనిమల్ పార్క్ తర్వాతే స్పిరిట్ ఉంటుందని అనుకున్నారు. కానీ సందీప్ మాత్రం నెక్స్ట్ తాను చేయబోయేది స్పిరిట్ సినిమానే అని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు.
రీసెంట్గా రెండు మూడు సార్లు ఈ ఏడాది చివర్లో స్పిరిట్ ఉంటుందని చెప్పాడు. అయితే.. లేటెస్ట్గా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు సందీప్. ఇప్పటి వరకు గుబురు గడ్డం అండ్ లాంగ్ హెయిర్‌తోనే ఎక్కువగా కనిపించాడు సందీప్. కానీ తాజాగా శ్రీవారికి మొక్కులు చెల్లిస్తూ తలనీలాలు సమర్పించుకున్నాడు. దీంతో సందీప్ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. శ్రీవారిని దర్శించుకున్న సందీప్‌ని.. మీ తదుపరి చిత్రం ఏంటని అడగ్గా.. ప్రభాస్‌తో స్పిరిట్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఈసారి సందీప్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.